మరింత సమాచారం -
ప్రార్థన -
ఇక్కడ క్లిక్ చేయండి
నేను ఎక్కడ ఉండగలను -
ఇక్కడ క్లిక్ చేయండి
మెహరాబాద్‌లో చూడవలసిన ఇతర ప్రదేశాలు -
ఇక్కడ క్లిక్ చేయండి
మెహర్ బాబా సినిమాలు -
ఇక్కడ క్లిక్ చేయండి
తీర్థయాత్ర గురించి
ఏరుచ్ జేస్సవాలా
ఆగష్టు
బాబా ప్రేమికులమైన మనము, మొదటగా మనము మెహెరాబాదునకు ఎందుకు వస్తున్నాము అనేదాన్ని మరువకూడదు. మెహెరాబాదు ఒక పుణ్య తీర్థయాత్ర స్థలము. ఇది ఒక సెలవులలో వచ్చే స్థలము కానీ, పర్యాటక ప్రాంతము కానీ, సురక్షిత ప్రదేశము కానీ కాదు. ధన్యుడైన ప్రతి యాత్రికుడు, వారి తీర్థయాత్ర సంబంధిత నిబంధనలను, తమ ప్రియతముడైన ప్రభుని ప్రసాదముగా స్వీకరించవలయును.
ఒకరి తీర్థయాత్రను, ప్రభునిచే స్వీకరించబడుట అంత సులభము కాదు, ఎందుకంటే అది కేవలం వారి సమాధి వద్ద మ్రోకరిల్లడము కన్నా ఎక్కువైనది. మన తీర్థయాత్రలో ఎదురైయే అన్నీ మరియు ఎటువంటి పరీక్షలు కానీ , శ్రమలుగాని హృదయపూర్వకముగా అంగీకరించవలయును-ఈ కష్టాలనే సంతోషముగా నిస్సందేహముగా మరియు ఏమి ఆశించకుండా అంగీకరించడము అనేది మన తీర్థయాత్రకు బాబా వారి అంగీకారమునకు గుర్తు. ఏ యాత్రికుడైతే, ఈ కష్టాలన్నీ సహించికూడా, సంతోషముగా అతని తీర్థయాత్ర పరిస్థితులను ఒప్పుకుంటాడో, ఆ యాత్రికుడు రెట్టింపుగా ధన్యుడౌతాడు.
అయినను, ప్రియతమ అవతార్ మెహెర్ బాబా, వారి అనంతమైన కరుణ, అనుగ్రహముతో మన తీర్థయాత్ర పరిస్థితులను ఎంత సుఖవంతముగా మరియు తేలిక చేశారంటే, మనము, వారు మన హృదయాలలో వారి ప్రేమను మేలుకొలుపుటకై, స్వయముగా మానవులలో మానవునిగా వారి కార్యక్రమకాలమంతా పడ్డ బాధలు మరచి పోయాము.
ప్రియా సోదర సోదరీమణులారా, మనము వారి ప్రేమ కానుక పొందువిధముగా ఆశీర్వదించబడ్డాము, ఇప్పుడు మనము మన అన్ని ఆపేక్షలు, అనుమానాలు మరియు కోరికలు కరిగించి సంపూర్ణ కృతజ్ఞతతో మరియు వారి ఇచ్ఛకు వదిలివేస్తూ, ఆ కానుకను తిరిగి ఇవ్వవలసిన సమయము ఆసన్నమైనది.
మన ప్రియతమ ప్రభువు, అవతార్ మెహెర్ బాబా వారి ప్రేమలో మరియు సేవలో : స్నేహపూర్వక నమస్కారములు.
ప్రేమతో మీ
ఏరుచ్